Hyderabad: అయ్యప్ప స్వామి మాల వేసుకున్నందుకు ఓ విద్యార్థిని క్లాసులోకి అనుమతించలేదు. ఈ ఘటన మొయినాబాద్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి స్కూల్ కు వచ్చిన విద్యార్థులను యాజమాన్యం అనుమతించలేదు. దీంతో మొయినాబాద్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల్ని స్కూల్ లోపలికి అనుమతించకుండా అధికారులు బయటే ఆపివేశారు. ప్రిన్సిపాల్ తీరు నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. తల్లిదండ్రులను చేస్తున్న ఆందోళనను అడ్డుకున్నారు. అయితే పోలీసులకు తల్లిదండ్రుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. మాల ధరిస్తే స్కూల్ లోపలికి ఎందుకు అనుమతించరు అంటూ మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. ఇది సరైన పద్దతి కాదని, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి మాల వేసుకున్న పిల్లలను ఇలా రోడ్డుపై నిలబెట్టడం ఎంత వరకు న్యాయమని మండిపడ్డారు.
పిల్లలను స్కూల్ లోపలికి అనుమతించకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాలి కానీ ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. స్కూల్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యం ఇలా ప్రవర్తిస్తే పిల్లలపై మత ప్రభావాలు పడే ఛాన్సస్ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పిల్లలను స్కూల్ యాజమాన్యం లోనికి అనుమతించాలని చెబుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం మాల ధరిస్తే ఎదుటివారు కూడా పవిత్రంగా ఉండాలని, దాని వల్ల అంటు అనేది వుంటుందని తెలిపారు. మహిళా టీచర్లు వస్తారని కావున అయ్యప్ప మాల ధరించిన వారు వస్తే ఇబ్బందిగా ఉంటుందనే అనుమతించలేదని చెబుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Balayya : రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన బాలయ్య..?
