Site icon NTV Telugu

Agnipath Scheme: అగ్నిపథ్‌ ఆందోళన ఎఫెక్ట్‌.. ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు..

Secunderabad

Secunderabad

అగ్నిపథ్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్థులు నిర్వహిస్తోన్న ఆందోళనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది.. ఒక్కసారిగా రైల్వేస్టేషన్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారు.. మొత్తంగా అగ్నిపథ్‌ పై ఆందోళనకారులు ఆగ్రహంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రణరంగంగా మార్చేశారు.. రైల్వేస్టేషన్‌లోని ఫర్నిచర్‌, సీసీ కెమెరాలు, ఏది కనిపించినా వదలకుండా ధ్వంసం చేశారు..

Read Also: Agneepath Scheme: సికింద్రాబాద్‌ విధ్వంసంపై స్పందించిన రేవంత్‌

ఇక, రైళ్లపై రాళ్లు రువ్వడంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు.. ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో మూడు రైళ్లు తగలబడ్డాయి.. అజంతా ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు.. ఎంఎంటీఎస్‌ రైలును దగ్ధం చేశారు ఆందోళనకారులు.. దీంతో.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ గుండా వెళ్లే అన్ని రైల్వేస్టేషన్లను నిలిపివేశారు.. సికింద్రాబాద్‌ ఘటనతో అప్రమత్తమైన రైల్వేశాఖ.. ఇతర రైల్వేస్టేషన్లలో భారీ బందోస్తు చర్యలు చేపట్టింది.. మరోవైపు.. ఎంఎంటీఎస్‌ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు. ఇక, రైల్వేస్టేషన్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. గాల్లోకి కాల్పులు జరిపారు.. రబ్బరు బులెట్లతో కాల్పులకు దిగారు.. ప్రతిగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.. దీంతో.. మరోసారి సికింద్రాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఈ ఘటనల్లో గాయపడినవారు వరుసగా ఆస్పత్రులు చేరుతున్నారు.. ఇప్పటికే దాదాపు 10 మంది వరకు బాధితులు గాంధీ ఆస్పత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=oNhnkAMnCds

Exit mobile version