Site icon NTV Telugu

Chikoti Casino Case: MLC ఎల్.రమణకు బీపీ డౌన్.. ఆసుపత్రికి తరలింపు

L. Ramana

L. Ramana

ED forward MLC L. Ramana: ఈడీ ముందు హాజరైన ఎల్‌.రమణకు అస్వస్థతకు గురయ్యారు. ఈడీ విచారిస్తున్న సమయంలో బీపీ డౌన్‌ కావడంతో.. ఆయనకు ఆసుపత్రికి తరలించారు. ఎల్.రమణ అనారోగ్యంతో వున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బీపీ డౌన్‌ కావడంతో కొందికి పడిపోవడంతో స్పందించిన అధికారులు ఆయనతో పాటు ఎల్‌.రమణ గన్‌ మెన్‌ , ఈడీ కి సంబంధించిన ఒక అధికారిని ఆయనతో పాటు ఆసుపత్రికి తరలించారు. ఈడీ విచారణ తరువాత ఆయన బయటకు వచ్చి పూర్తీ వివరాలు వెల్లడిస్తా అంటూ మీడియాకు తెలిపి లోనికి వెళ్లిన ఎల్.రమణ ఇలా అస్వస్థతకు గురికావడంతో సంచళనంగా మారింది.

Read also: MLC Kavitha: ఎంపీ అరవింద్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా

తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. దీంతో.. ఈడీ విచారణ రాజకీయ వేడిని పెంచుతోంది. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో వణుకు మొదలైంది. ఇవాళ కేసినో కేసులో ఈడీ ముందు MLC ఎల్ రమణ విచారణకు హాజరయ్యారు. విదేశీ టూర్స్, బ్యాంకు లావాదేవీలతో ఎల్ రమణ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే.. విచారణ ముగిసాక వివరంగా మాట్లాడతా అని ఎల్.రమణ తెలిపిన విషయం తెలిసిందే..

Exit mobile version