NTV Telugu Site icon

Delhi liquor scam case: దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా.. కానీ టైం కావాలీ..

Mlc Kavitha

Mlc Kavitha

Delhi liquor scam case: ఈడీ కి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేనని 15న హాజరవుతానని లేఖ లో పేర్కొన్నారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని. ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయ్యాయని ఈడీకి వివరించారు. ఈడీ స్పందన ఎలా ఉండనుంది.. ఏం చెప్పనుంచి పర్మిషన్ ఇస్తుందా? లేదా? అనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. ఈనేపథ్యంలో.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్ళే దారులు అన్ని మూసివేశారు అధికారులు. కవిత ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోనికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతి ఇవ్వడం లేదు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీకెడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు.

కాగా.. బెదిరింపు వ్యూహాలు మమ్మల్ని అడ్డుకోలేవని, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని రాజకీయ భాగస్వామ్యంలో మహిళలకు సముచిత భాగస్వామ్యాన్ని కల్పించేందుకు దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా ఏకైక డిమాండ్ అన్నారు. బిజెపి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ మార్చి 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఒకరోజు శాంతియుత నిరాహారదీక్ష కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో పాటు భారత్ జాగృతి కలిసి వస్తుందన్నారు.

Read also: Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. రేపు రాజధానికి రావాలని కవితకు ఈడీ నోటీసులు

ఈ సంఘటనల నేపథ్యంలో.. మార్చి 9న న్యూఢిల్లీలో హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాకు సమన్లు ​​పంపిందని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా, నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని, అయితే, ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్‌ల కారణంగా. నేను దానికి హాజరయ్యే తేదీపై న్యాయపరమైన అభిప్రాయాలను కోరతా అన్నారు. మా అధినేత సీఎం కేసీఆర్ పోరాటానికి, గొంతుకు వ్యతిరేకంగా, మొత్తం బిఆర్‌ఎస్ పార్టీపై ఈ బెదిరింపు వ్యూహాలు మమ్మల్ని అడ్డుకోలేవని కేంద్రంలోని అధికార పార్టీ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మేము మీ వైఫల్యాలను బహిర్గతం చేయడానికి , భారతదేశానికి ఉజ్వలమైన , మెరుగైన భవిష్యత్తు కోసం గొంతు పెంచడానికి పోరాడుతూనే ఉంటామన్నారు. అణచివేత ప్రజావ్యతిరేక పాలన ముందు తెలంగాణ ఎన్నడూ తలవంచబోదని ఢిల్లీలోని అధికార వ్యాపారులకు కూడా గుర్తు చేస్తానని తెలిపారు. ప్రజల హక్కుల కోసం నిర్భయంగా, ఉధృతంగా పోరాడుతామన్నారు కవిత.

గతేడాది డిసెంబర్‌ 11న ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో విచారించారు. సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసి సెక్షన్ 160 సిఆర్‌పిసి కింద ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ జారీ చేసిన నోటీసులపై ఏం చేయాలనే అంశంపై కవిత న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసిన సమయంలో కూడా ప్రగతి భవన్‌లో న్యాయ నిపుణులతో కవిత చర్చించిన సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే తనను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కవిత గతంలో ఆరోపించారు.
Anantapur Police: రాప్తాడు హైవేపై హవాలా డబ్బు.. అనంతపురం పోలీసులు అదుపులో కేరళ గ్యాంగ్

Show comments