MLC Jeevan Reddy: రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రధాని హోదాలో ఉండి మత విద్వేషాలను రెచ్చగొడు తున్నారన్నారు. స్వార్ధ రాజకీయాలకోసం మీరు దేశాన్ని ఎటు వైపు తీసుకపోవాలని అనుకుంటున్నారు మోడీ అన్నారు. ఆర్టీసీ బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మోడీ తప్పు పడుతున్నారన్నారు. మహిళల పట్ల మోడీకి ఉన్న వివక్షత అర్ధమౌతుందన్నారు. మోడీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ద్వంద వైఖరి ని అవలంబిస్తున్నాడన్నారు. దేశంలో బుల్ డోజర్ కల్చర్ ను తెచ్చింది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ కాదన్నారు. ఫైజాబాద్ కోర్ట్ తీర్పు ను గౌరవించి 1989 లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. అయోధ్య రామ్ లాల్లో గేట్లు తెరిచాడన్నారు.
Read also: Fake Notes : తొమ్మిదో తరగతి ఫెయిల్.. యూట్యూబ్లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి..
రామ మందిరం అంకురార్పణ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు. లేదంటే 20 ఏండ్ల ముందు నిర్మాణం పూర్తి అయ్యేదన్నారు. అప్పుడు మోడీ ఎక్కడ ఉన్నాడన్నారు. వాస్తవాలను కప్పి పుచ్చడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. మత సామరస్యానికి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ బీజేపీ అన్నారు. శ్రీ రాముణ్ణి రాజీవ్ గాంధీ ఆదర్శంగా తీసుకున్నాడని తెలిపారు. న్యాయ స్థానం తీర్పును ఎవరైనా గౌరవించాలన్నారు. బీజేపీ న్యాయ స్థానం ఆసరాగా తీసుకుని నిర్మాణం చేసిందన్నారు.
Prithviraj Sukumaran : రాజమౌళి సినిమా లో పృథ్విరాజ్ సుకుమారన్.. క్రేజీ న్యూస్ వైరల్..?
