MLC Jeevan Reddy: జాతీయ జెండా ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ నే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దేశ తొలిప్రదాని జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ఇందిరా భవన్ లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం నెహ్రు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయానికి,పారిశ్రామికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కొన్ని దృష్ట శక్తులు దేశానికి ఆయన చేసిన సేవలు , త్యాగాన్ని తగ్గించేందు కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాశ్మీర్ అంశం అప్పుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రు చేర్చిన అంశమే ఉన్నప్పుడు ఆర్టికల్ 370డి అన్నారు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ ఆద్వర్యంలో కాదా? అని ప్రశ్నించారు. జాతీయ జెండా ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. కాంగ్రెస్ నేతలను విమర్శించడం సరికాదన్నారు.
Read also: MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
దేశంలో మతసామరస్యం కాపాడాల్సిన ప్రధాని నే.. మత విద్వేషం పెంచుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక వెనుకబాటు తనం కారణం తో రిజర్వేషన్లు ఇస్తున్న మోడీ.. ఆ కోటా లో మైనార్టీలు కూడా బెనిఫిట్ పొందుతున్నారని తెలిపారు. తెలంగాణకి వచ్చి మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటాడన్నారు. పదేళ్ళలో హిందు సమాజం కి బీజేపీ ఏదైనా లబ్ది చేకూర్చారా..? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలో 75 శాతం హిందు సమాజం.. ఈబీడబ్లూసీ రిజర్వేషన్లు లో లబ్ది చేకూర్చకుండా చేసింది మోడీ కదా..? అని మండిపడ్డారు. తెలంగాణలో 4 శాతం మైనార్టీ రిజర్వేషన్లు తొలగిస్తే ఈబీడబ్లూసీ రిజెర్వేషన్ లో లబ్ది పొందరా..? అని ప్రశ్నించారు. ముస్లిం రిజెర్వేషన్ ఇస్తున్నది మోడీ అన్నారు. ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజెర్వేషన్ ఇచ్చింది మేము అన్నారు. దళితులు బీసీ,ఎస్టీల హక్కులు బీజేపీ కాల రాస్తోందన్నారు. మత విద్వేషాలు పెంచి బీజేపీ లబ్దిపొందాలని చూస్తున్నారన్నారు. కానీ హిందువులకు మేలుచేసింది ఏం లేదన్నారు.
CM Revanth Reddy: రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు.. సీఎం రేవంత్ కసరత్తు..