MLC Jeevan Reddy Fires On BJP For Rahul Gandhi Disqualification: బీజేపీ, ప్రధాని మోడీలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, దేశాన్ని చీకట్లోకి నెట్టేశారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. సభ్యత్వం రద్దుతో రాహుల్ గాంధీ గొంతు నొక్కలేరని అన్నారు. ఆర్థిక నేరగాళ్లపై ప్రశ్నిస్తే, రాహుల్ గాంధీపై వేటు వేస్తారా? అని ప్రశ్నించారు.
Minister KTR: నాలుగేళ్లలో ఏం చేశావ్.. బండి సంజయ్‌పై కేటీఆర్ ధ్వజం
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుని ప్రజాస్వామ్యంపై దాడిగా జీవన్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేకే రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేశారని చెప్పారు. ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు.. యావత్ ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణత్యాగం చేస్తానని చెప్పి, ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ అందరికీ ఆదర్శం అన్నారు. ప్రపంచ శాంతి కోసం రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారన్నారు. దేశం కోసం నెహ్రూ కుటుంబం త్యాగం చేసిందని వెల్లడించారు.
Jagadish Reddy: బీఆర్ఎస్‌ని చూసి.. మోడీ & గ్యాంగ్‌కు భయం పట్టుకుంది
లండన్‌లో ఖలిస్తానీ జెండా ఎగురవేస్తే.. ప్రధాని మోడీ ఏం చేశారు? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ప్రశ్నించకుండా రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేసిన మోడీకి.. దేశ ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. పబ్లిక్ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం నిజం కాదా? అని నిలదీశారు. సభ్యత్వం రద్దు చేసి పార్లమెంట్‌లో నిలువరిస్తారేమో కానీ.. రాహుల్ గాంధీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఆపడం మీ తరం కాదని తేల్చి చెప్పారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఓబీసీలకు న్యాయం జరిగిందని తెలియజేశారు.