MLC By Election: కేంద్ర ఎన్నికల సంఘం నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. శాసనమండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 13వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగగా.. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే.. వారిలో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ను ఈసీ నియమించింది. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నల్గొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాలని పేర్కొంది.
Read also: Anil Ravipudi-IPL: ఐపీఎల్ మ్యాచ్‌లపై కామెంట్స్.. డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆడుకుంటున్న ఫాన్స్!
గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో ఖాళీ అయిన స్థానానికి ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2021 మార్చిలో ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పదవీకాలం మార్చి 2027 వరకు ఉంది. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో డిసెంబరు 9న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. ఖాళీ అయిన నాటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్నది నిబంధన. దీంతో ఈసీ మే 27న పోలింగ్ తేదీని ప్రకటించింది.
Read also: Salman Khan House Firing Case : ‘చిత్రహింసలు పెట్టి చంపేశారు’.. అనుజ్ కుటుంబ సభ్యుల ఆరోపణ
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన చింతపండు నవీన్ (తిన్మార్ మల్లన్న) ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న చాలా ఏళ్లుగా సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి పలుమార్లు జైలుకు వెళ్లాడు. 2021లో స్వతంత్ర ఎమ్మెల్సీగా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు వినిపించింది. కానీ వెలిచాల రాజేందర్ రావును అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో మలన్నను ఎమ్మెల్సీగా నిలబెట్టాలని నిర్ణయించారు.
Varanasi: హాస్యనటుడు శ్యామ్ రంగీలా కీలక ప్రకటన.. మోడీపై పోటీ చేస్తున్నట్లు వెల్లడి