ఇళ్ళందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ మాట్లాడుతూ… దళిత బంధు పథకం మీద బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. దళితులకు ఏం చేద్దామని నాలుగు సంవత్సరాల క్రితం కేసీఆర్ నన్ను అడిగారు. ఎడారి లాంటి రాష్ట్రం, రైతుల ఆత్మహత్యలు, చేనేత ఆత్మహత్యలు,ఎన్ కౌంటర్లు ఉన్న తెలంగాణ ఈ రోజు ఇక్కడి వరకు వచ్చింది. జీహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండి పోతే బండి, కారు పోతే కారు అన్నరు ఏమైంది. ప్రజలను మాయ లోకంలో ముంచి ఎంపీగా గెలిచింది బండి సంజయ్. ఆయనకు కు ఆస్కార్ ఇవ్వచ్చు అని తెలిపారు.
ఇక బీజేపీ డ్రామాలు మొదలు పెట్టింది. ఈటల అస్వస్థతకు గురవడాన్ని ప్రజలు ఎట్ల నమ్ముతరు. దళిత బంధును ఆపేందుకు కోర్టుకు వెళ్లారు. దళితులను బానిసలుగా చూసిన వ్యక్తి ఈటెల రాజేందర్. ఎవరు అడ్డుకున్న దళిత బంధు ఆగదు. బల్ల గుద్ది చెప్తున్న దళిత బంధు కచ్చితంగా అమలు చేసి తీరుతాం. లక్ష నాగళ్లతో ఫామ్ హౌజ్ ను దున్నుతం అంటున్నారు. ఏం అధికారం ఉందని అడుగుతున్నా. ప్రగతి భవన్ పెల్చుతామని బండి సంజయ్ పిచ్చి లేసి మాట్లాడుతున్నడు. కోటి ఉద్యోగాలు, రూ.15లక్షలు ఆకౌంట్ లో వేశారు బిజేపి నాయకులు చెప్పాలి. క్యూ న్యూస్ మల్లన్నను తీసుకు వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో వెయ్యాలి. ఈటల తన అల్లుడి కాళ్ళు కూడ కడుగలేదు. కానీ దళితులతో కాళ్ళు కడిగిచ్చుకుంటుండు అని పేర్కొన్నారు.
