Site icon NTV Telugu

35 రూపాయల పెట్రోల్ కి 65 రూపాయల టాక్స్ : సీతక్క

పెట్రోల్,డిజిల్ ధరల పెంపును నిరసిస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్ నేతల ధర్నా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెట్రోల్,డిజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేసిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… ప్రభుత్వం 35 రూపాయలు పెట్రోల్ కి 65 రూపాయల టాక్స్ వసూలు చేస్తుంది అన్నారు. సాధారణ ప్రజల దగ్గర ఇంత దోచుకుంటూ పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యాపారులు చెల్లించనీ లోన్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది. కష్టకాలము లో ఉన్న ప్రజలకు రాయితీ ఇవ్వాల్సింది పోయి పన్నుల భారం మోపుతున్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేసారు.

Exit mobile version