MLA Rathod Bapurao Car Accident News: ఆదిలాబాద్ జిల్లా బోథ్ కి చెందిన అధికార బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ జిల్లా నిర్మల్ బైపాస్ సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం ఆవును ఢీకొట్టినట్టు సమాచారం. నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ వెళుతుండగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కోర్టికల్ వద్ద జాతీయ రహదారిపై పశువుల మంద అడ్డు రావడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వాహనం అదుపు తప్పినదని ఆ మందలోనే ఉన్న ఆవును ఢీకొట్టిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోయినా ఎమ్మెల్యే చేతికి తీవ్రగాయాలయ్యాయని, కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది.
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
అయితే కారు ప్రమాద సమయంలో వెనుక ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది. కాన్వాయ్ అయితే కనుక ఖచ్చితంగా ప్రమాద తీవ్రత పెరిగి ఉండేదని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేతి వేలికి తీవ్ర గాయం అవడంతో బాపురావును అక్కడి స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు వాహనంలో నేరడిగొండ టోల్ ప్లాజా వరకు తరలించగా విషయం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్యే ను బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే కారు డీ కొన్న సమయంలో రెండు పశువులు తీవ్రంగా గాయపడ్డాయని తెలుస్తోంది. కార్‌లోని ఎమర్జెన్సీ బెలున్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది కానీ ఎమ్మెల్యే బాపురావు మూడు చేతి వేళ్లు విరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఇక ఆ తరువాత ఎమ్మెల్యేకి మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ కు తరలించారు.