NTV Telugu Site icon

MLA Raja Singh: నన్ను అరెస్ట్ చేస్తే జరిగే విధ్వంసాలకు నేను బాధ్యుడిని కాదు

Mla Raja Singh

Mla Raja Singh

MLA Raja Singh: నన్ను అరెస్ట్ చేస్తే హనుమాన్ భక్తులు వింధ్వసం సృష్టిస్తే నేను బాధ్యుడిని కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరిన రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటీవలి కాలంలో ఎక్కడికి వెళ్లినా మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు రాజాసింగ్. తనపై కేసులు నమోదవుతున్నప్పటికీ రాజాసింగ్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. అయితే తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజాసింగ్ ఈరోజు మళ్లీ ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారోనని భావించిన పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయితే రాజాసింగ్ మాట్లాడుతూ.. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ పాల్గొన్నారు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు బయలు దేరానని అన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలని అన్నారు. తెలంగాణ 8వ నిజాం రజాకార్ పోలీసుల వల్లే హిందువులను అణిచివేయలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారని అన్నారు. ఇలాంటి పరిస్థతుల్లో హిందువులు బతకగలుగుతారా? అంటూ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేస్తే హనుమాన్ భక్తులు వింధ్వసం సృష్టిస్తే నేను బాధ్యుడిని కాదని అన్నారు.

ఇది ఇలా ఉంటే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనేక కేసులు నమోదవుతున్నాయి. ఏదో ఒక చోట, ఏదో ఒక కార్యక్రమంలో మతం, వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముంబైలో జరిగిన ఓ బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రెండు రోజుల క్రితం రాజాసింగ్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా రాజాసింగ్ తన తీరు మార్చుకోలేదు. ఎప్పటిలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ అందరిపై విరుచుకుపడుతున్నాడు. తాజాగా రాజాసింగ్ చేసిన మరో ప్రసంగంపై కేసు నమోదైంది. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగంపై ఎస్సై వీరబాబు అభ్యంతరం తెలిపారు. రాజాసింగ్ తన కుమారుడిని పరిచయం చేస్తూ ఇతర వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎస్సై వీరబాబు ఎమ్మెల్యేపై అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజా సింగ్‌పై ఐపీసీ 153-ఎ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక మరోవైపు, జనవరి 29, 2023న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 153ఏ 1(ఏ) కింద రాజాసింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు కూడా అందించారు. ఒక కేసులో బెయిల్ మంజూరు చేసే సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని తెలంగాణ హైకోర్టు షరతు విధించిందని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు వివరణ కోరారు. అలాగే, 2022 అక్టోబర్‌లో హైదరాబాద్ శిల్పారామంలో హాస్యనటుడు మునవర్ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోకు అనుమతి ఇవ్వడంపై రాజాసింగ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం నేతలు ఆరోపించారు. అనేక ముస్లిం సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. రాజాసింగ్‌పై నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు తరలించారు. ఆ కేసులో గతేడాది నవంబర్ 9న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Royal Enfield New Record: వాడు నడిపే బండీ.. రాయల్‌ ఎన్‌ఫీల్డు. సేల్స్‌లో కొత్త రికార్డు