NTV Telugu Site icon

Raja Singh: సచివాలయంలో మీటింగ్ అని పిలిస్తేనే వచ్చా.. ఎందుకు అడ్డుకుంటున్నారు

Mla Rajasingh

Mla Rajasingh

Raja Singh: హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొత్త సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. రాజాసింగ్‌ను కొత్త సచివాలయంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం గేటు వద్ద లోనికి వెళ్లకుండా రాజాసింగ్‌ను అడ్డుకున్నారు. అయితే ఈ పరిణామాలపై రాజాసింగ్ సీరియస్‌గా స్పందించారు. సమావేశం ఏర్పాటు చేశామని.. నగరంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన సచివాలయానికి సెక్రటేరియట్ వద్దకు బుల్లెట్ బైక్‌పై వచ్చారు. ఆయనను భద్రతా సిబ్బంది అడ్డగించారు. సచివాలయం లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. కాగా.. దీంతో రాజాసింగ్ చాలా సేపు గేటు బయటే వెయిట్ చేశారు. అయినా ఫలితం లేకపోవటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

Read also: Telangana martyrs memorial: రాజధానికి మరో మణిహారం.. త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్

వెళ్లగా.. అనుమతించలేదని మండిప్డారు. పోలీసులు తనను అడ్డుకోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తనను సమావేశానికి పిలిస్తే పోలీసులు అడ్డుకుని అవమానకరంగా ప్రవర్తించారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టైంపాస్ కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీటింగ్ పెట్టారా? అని ప్రశ్నించారు. కొత్త సచివాలయంలోకి ఎమ్మెల్యేలనే అనుమతించకపోతే సచివాలయంలోకి ఇంకెవరిని అనుమతిస్తారు? అని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలోకి ప్రజాప్రతినిధులను రానివ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని అసలు ఎవరు చెప్పారో పోలీసులు వివరించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
Telangana martyrs memorial: రాజధానికి మరో మణిహారం.. త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్