NTV Telugu Site icon

MLA Kranti Kiran: దామోదర రాజనర్సింహ నాపై కుట్ర చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Medak Dalitabandhu

Medak Dalitabandhu

MLA Kranti Kiran: మెదక్ జిల్లాలో దళితబంధు లొల్లి షురూ అయ్యింది. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తమ్ముడు రాహుల్ కిరణ్ దళితబంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తమ్ముడు రాహుల్ కిరణ్ పై టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో పల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య ఫిర్యాదు చేయడంతో అసలు భాగోతం బయటకు వచ్చింది. పల్వంచ గ్రామంలో నలుగురు దళితుల నుంచి 3 లక్షల చొప్పున 12 లక్షలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి, తమ్ముడు రాహుల్ కి ఇచ్చామని భూమయ్య చెబుతున్నాడు. దళితబంధు రాకపోవడంతో డబ్బులు అడిగితే సృజన్ అనే వ్యక్తి చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయంపై తనపై వస్తున్న ఆరోపణలపై ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. భూమయ్య చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. కేవలం రాజకీయ కక్షతో ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తను తప్పు చేస్తే లై డిటెక్టర్ పరీక్షకు కూడా రెడీ అన్నారు. కావాలనే మంత్రి దామోదర రాజనర్సింహ ఇలా కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.

Read also: Sreeleela: కొన్ని రోజులు షూటింగ్ కి దూరం… కారణమదేనా?

దళిత బంధులో కమీషన్లు తీసుకున్నానంటూ తనపై ఒక వ్యక్తి పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఫిర్యాదు రాజకీయ కుట్ర, అయినప్పటికీ ఆరోపణలపై విచారణకు తను సిద్ధంగా వున్నానని అన్నారు. అయితే నిజాలు నిగ్గుతేల్చడానికి ‘లై’ డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని దానికి తను సిద్దాంగా ఉన్నానని క్రాంతి కిరణ్ తెలిపారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తికి కూడా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఫిర్యాదులోని వాస్తవాన్ని ఫిర్యాదు వెనకాల ఉన్న కుట్రను ఛేదించాలని పోలీస్ లను కోరుతున్నానని అన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహ చేస్తున్న అరాచకాలకు ఈ ఫిర్యాదు పరాకాష్ట అన్నారు. తప్పుడు కేసులతో తమ కార్యకర్తలను వేధిస్తున్నాడని మండిపడ్డారు. తమ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మహిళ కార్యకర్తల ఇళ్లలోకి జోరబడి వారిపై కోడి గుడ్లతో దాడి చేయిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల ఇళ్ల పైకి టపాసులు విసురుకుంటు వారి కుటుంబాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Joe Biden Car Crash: భద్రతా వైఫల్యం.. జో బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు!

కార్ల కింద టపాసులు పేల్చుకుంటు దామోదర అనుచరులు రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి రాయలసీమ ఫ్యాక్షన్ గ్రామాల్లో మాత్రమే ఉండేదని.. ఇప్పుడు ఆందోల్ లో ఏ గ్రామంలో చూసిన ఇదే పరిస్థితి కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు గడవక ముందే మంత్రిగా అన్ని స్థాయిల్లోని అధికారులను బెదిరింపులతో తమదారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. పోలీస్ అధికారులను సైతం దామోదర బెదిరిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రశాంతంగా పనిచేసుకొని పరిస్థితిని దామోదర తీసుకొచ్చాడని అన్నారు. గ్రామాల్లో రాజకీయంగా ఆయనకు దీటుగా నిలబడినందుకే తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టిస్తున్నాడని అన్నారు. జీతం మీద మాత్రమే ఐదేళ్లు గడిపిన చరిత్ర నాది. నేను ఎలాంటి వాన్నో నాతో కలిసిన ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. రాజకీయంగా బదనాం చేయడమే లక్ష్యంగా కొందరిని లోబరుచుకుని, ప్రలోభపెట్టి దామోదర దిగజారి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నిష్పక్షపాత విచారణ జరగాలని నిజాలు నిగ్గుతేలాలని డిమాండ్ చేస్తున్నానని క్రాంతి కిరణ్ అన్నారు.
Lokesh Kanagaraj: రజినీ సినిమాపై దృష్టి పెట్టకుండా ఇవేమి పనులు సార్?

Show comments