Site icon NTV Telugu

Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి.. స్వగ్రామానికి పార్థివదేహం

Dayakar Reddy

Dayakar Reddy

Kothakota Dayakar Reddy: తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు, మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకుని మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపురం గ్రామానికి వచ్చాడు. ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించడంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి హుటా హుటిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. దయాకర్ మృతి పట్ల సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read also: LIC Scheme: అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.10,000 సులువుగా పొందవచ్చు..

కొత్తకోట దయాకర్ రెడ్డి 1994, 1999లో టీడీపీ నుంచి అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009లో మక్తల్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2002లో టీడీపీ నుంచి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన దయాకర్‌రెడ్డి భార్య సీత 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక వీరిద్దరికీ టీడీపీతో మంచి అనుబంధం ఉంది. రెండు రాష్ట్రాల విభజన తర్వాత కూడా ఆయన పార్టీలో కొనసాగారు. చేనేతపై దశాబ్దాల అద్భుతాల లోగోను ఆవిష్కరించిన నేతన్న దయాకర్ రెడ్డి దంపతులు గతేడాది ఆగస్టులో టీడీపీకి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వస్తుందని కన్నీరు పెట్టుకున్నారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరతారని అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు. ఇద్దరు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతలో దయాకర్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో పార్టీ మార్పు దిశగా అడుగులు పడలేదు.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Exit mobile version