NTV Telugu Site icon

MLA Ahmed Pasha Quadri: రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌కు లేఖ

Ahmed Pasha Quadri Letter

Ahmed Pasha Quadri Letter

MLA Ahmed Pasha Quadri Write Letter To Speaker Pocharam For Expulsion Of MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని కోరుతూ.. స్పీకర్ పోచారంకు ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ మూడు పేజీలతో కూడిన లేఖ రాశారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన దానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్తపై అతను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లీం మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీశాయని, గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి పలు వివాదాలకు తెరలేపారని చెప్పారు. అతను అసెంబ్లీలో సభ్యుడిగా అనర్హుడని, అసెంబ్లీ నుంచి బహిష్కరణకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను మొదలు పెట్టాలని ఆ లేఖలో ఎంఐఎం ఎమ్మెల్యే కోరారు.

‘‘శాసన సభ యొక్క నిజమైన విశ్వాసం, విధేయతతో ఉంటానని తాను అసెంబ్లీ సభ్యుడిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా రాజాసింగ్ వ్యవహరిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్తపై అతను అనుచిత వ్యాఖ్యలు చేసి, దేశంలో అల్లరకు కారణమై.. ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. భారత రాజ్యాంగంలో లౌకికవాదం, సోదరభావాలు ఒక భాగం. కానీ, రాజాసింగ్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ముస్లింపై ఆయన ఎల్లప్పుడూ శతృత్వం, ద్వేష భావాల్నే వ్యక్తపరిచారు. భారత సమగ్రతను కాపాడుతానని చేసిన ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించాడు. తాను అసెంబ్లీ సభ్యుడిగా యోగ్యుడ్ని కానని, ఇటీవల మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఆయన అనుచితంగా ప్రవర్తించడం వల్ల హౌస్ నుంచి సస్పెండ్ కూడా అయ్యాడు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించి.. రాజాసింగ్‌ని అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని కోరుతున్నా’’ అంటూ అహ్మద్ పాషా ఖాద్రీ ఆ లేఖలో కోరారు. ఈ లేఖకు గతంలో రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన సాక్ష్యాలను సైతం ఎటాచ్ చేసినట్టు ఆయన తెలిపారు.

Show comments