Site icon NTV Telugu

Aadi Srinivas: సిరిసిల్ల నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తెస్తాం..!

Aadi Srinivas Sirisilla

Aadi Srinivas Sirisilla

Aadi Srinivas: రాజన్న సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లను డెవలప్మెంట్ చేయడానికి రేడీగా ఉన్నామన్నారు. బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వమని మా మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. నేత కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని తెలిపారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తీసుకొస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు జ్యోతి రావు ఫులే గారిని గుర్తు చేశారా? అని ప్రశ్నించారు. వెయ్యి ఎలుకలు తిని కూడా తీర్థ యాత్ర చేసినట్టుగా ఉంది కేటీఆర్ మాట్లాడినతిరు అలాంటి మాటలు మాట్లాడాడని హెచ్చరించారు.

Read also: Nagoba Jatara: నాగోబా జాతరకు సర్వం సిద్ధం.. అంబరాన్నంటిన ఆదివాసి సంబరాలు..

తండ్రి చాటున బిడ్డ లా ఉంది రాజకీయాల్లోకి వచ్చిన నీకు రాజకీయ కోణం ఉందా కేటీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో కేటీఆర్ మాట్లాడిన మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నీ ఒక్క మాటా అన్న ఊరుకునేది లేదని హెచ్చరించారు. సిరిసిల్ల లో ఒక్క ఉపాధి అన్న కల్పించావా కేటీఆర్.. మున్సిపల్ కరెంటు బిల్ కట్టని పరిస్థితి మీ చరిత్ర అంటూ మండిపడ్డారు. మాకు అసెంబ్లీలో 65 సీట్లు ఉన్నాయని అన్నారు. మీకు కూడా గత అసెంబ్లీ లో వచ్చినవి కూడా అంతే కదా? అని ప్రశ్నించారు. ప్రజలు పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఓట్లు వేసే పరిస్తితి లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. ప్రజలు మీకు ఓట్లు వేసే ప్రసక్తి లేదని అన్నారు. నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు దొర అహంకార మాటలన్నారు. ఈ ప్రభుత్వం, పేదల ప్రభుత్వమని తెలిపారు.
CM Revanth Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి మృతి.. సంతాపం తెలిపిన సీఎం

Exit mobile version