NTV Telugu Site icon

Missing Child Case: బాలిక మిస్సింగ్‌ విషాదాంతం.. చెరువులో మృతదేహం

Missing Chaild Case

Missing Chaild Case

Missing girl is a tragedy: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థిని మిస్సింగ్ కేస్‌ విషాదాంతంగా మారింది. 26 గంటల తరువాత బాలిక మృతదేహం చెరువులో లభ్యమైంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిన్న స్కూల్‌ కు వెళ్లిన బాలిక 26గంటల తరువాత చెరువులో లభ్యం కావడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు సీసీకెమెరా అధారంగా బాలికను ఆచూకీ ఛేదించేందుకు చర్యలు చేపట్టడంతో ఎవరికైనా తెలిసి బాలికను ఏమైన చేసి చెరువులో పడేశారా? లేక నిన్ననే బాలికపై ఏమైనా అఘ్యాయిత్యం చేసి ఈపని చేశారా? అనే కోణంగా విచారన చేపట్టారు. అసలు బాలిక స్కూల్‌ కు వెళ్లి బ్యాగ్‌ స్కూల్లో పెట్టే ఎందుకు బయటకు వచ్చింది? ఎవరైనా రమ్మని పిలిచారా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. నిన్న మిస్సైన బాలిక ఇవాల చెరువులో విగత జీవిగా లభ్యమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలికను చంపిన వారిని కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.

Read also: Twitter: శ్రమదోపిడీకి తెరతీసిన ఎలాన్ మస్క్..కంపెనీలో మిగిలింది 80మంది ఉద్యోగులే

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థిని గురువారం (నిన్న) ఉదయం 9 గంటలకు స్కూల్‌ కు ఇంట్లోంచి స్కూలుకి తీసుకొని వెళ్లానని, స్కూల్లో దింపి తాను పనికి వెళ్లారు. ఉదయం 9.30 ప్రాంతంలో స్కూల్ సంబంధించిన టీచర్ పాప కనిపించట్లేదని ఫోన్ చేశారు. కంగారుపడి స్కూల్‌ దగ్గరకు వెళ్లామని స్కూల్లో పాప బ్యాగు మాత్రమే ఉంది. పోలీసులకు చెప్పిన కూడా స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉదయం చెప్తే సాయంత్రం వరకు కూడా పోలీసులు పాప ఆచూకీ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 గంటలు దాటుతున్న పాప ఎక్కడ ఉందో.. మా పాప మాకు కావాలంటూ కన్నీరుమున్నీరవుతున్న సమయంలో.. పోలీసులు పాప ఆచూకీకోసం తెలుసుకోవడం కోసం చర్యలు వేగవంతం చేశారు. అయితే కొందరు పోలీసులకు చెరువులో మృతదేహం లభ్యమైందని తెలపడంతో హుటాహుటిన బయలుదేరిని పోలీసులకు పాప చెరువులో విగతజీవిగా కనిపించింది. పాపను చంపేసి ఇక్కడ వేశారా? లేక ఇంకేమైనా కారణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.
Best and Worst IPOs: 2022లో అత్యుత్తమ మరియు అతిచెత్త ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌లు