Site icon NTV Telugu

Satyavathi Rathod: మంత్రిని చూసి కన్నీరు పెట్టుకున్న బాధితులు

Satyavathi Rathod

Satyavathi Rathod

నేడు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటించారు. మంత్రిని చూడగానే బాధితులంతా వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. సర్వం కోల్పోయామని ఆదుకోవాలని విజ్క్షప్తి చేసారు. భూపాలపల్లిలో పలిమెల గ్రామాన్ని గోదావరి వరద ముంచెత్తింది. దీంతో ఆ గ్రామ ప్రజల కోసం మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో పునవారస శిభిరం ఏర్పాటు చేశారు. దీంతో ఈ శిబిరంలో సుమారు నాలుగు వందల పైగా బాధితులు వున్నారు. పునరావాస శిబిరాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్‌ ను వరద బాధితులను ఓదార్చారు. ఏం అమ్మ ఇల్లు వదిలేసి పోతున్నామని బాదతో ఉన్నారా.. అందర్నీ బాగా చూసుకుంటాను ఎవరి గురించి ఆందోళన చెందవద్దు మిమ్మల్ని ఎలా తీసుకు వచ్చామో అలాగే చూసుకుంటామని హామీ ఇచ్చారు.

read also: Vijaya Sai Reddy: అలా అయితే హెరిటేజ్ కంపెనీ కూడా నాదే.. చంద్రబాబు ఏమంటారు?

జిల్లా యంత్రాంగం మీ సంక్షేమం పట్ల చైస్తూ ఉందని మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని దైర్యం చెప్పారు. అధైర్యం పడవద్దని బాధితులకు భరోసా ఇచ్చారు. పెగడపల్లి నుండి మంపునకు గురైన పలిమెల మండల కేంద్రానికి ఆమె వెళ్లారు. గోదావరి బాధితులను పరామర్శిస్తూ.. ముందుకు సాగుతున్న మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ భవేస్‌ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్లర్‌ తదితరులు పాల్గొన్నారు.

Vijaya Sai Reddy: అలా అయితే హెరిటేజ్ కంపెనీ కూడా నాదే.. చంద్రబాబు ఏమంటారు?

Exit mobile version