NTV Telugu Site icon

Minister Tummala: సంక్షేమ పథకాలు అమలు కొంత ఆలస్యం అవ్వొచ్చు.. కానీ..

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

Minister Tummala: సంక్షేమ పథకాలు అమలు కొంత ఆలస్యం అవ్వొచ్చు కానీ, చేసి తీరుతామని వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మీరు కోరుకున్నట్టే ఖమ్మం లో మార్పు వచ్చిందన్నారు. ఈ మార్పు మీకు మీరుగా తెచ్చుకున్న మార్పు అన్నారు. మీ కోరికలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తాను తెలిపారు. నిర్బంధ పాలన, అవినీతి పాలన, అశాంతి పాలన, నియంత పాలనను తరిమికొట్టారని అన్నారు. ఈనాడు ఉద్యోగులతో పెట్టుకోలేదు, మీ విషయాల్లో తల దూర్చలేదని క్లారిటీ ఇచ్చారు. గట్టిగా మందలించి అయినా సమన్వయం చేసి ప్రజల సేవలో భాగస్వామ్యం చేశాను తప్ప ఇబ్బంది పెట్టలేదని అన్నారు. ఈ జిల్లా సర్వోతోముఖాభివృద్ధికి మీ భాగస్వామ్యం కావాలన్నారు.

Read also: Farooq Abdullah: రాముడు ప్రపంచంలోని ప్రజలందరికీ దేవుడే.. కేవలం హిందువులకు మాత్రమే కాదు..

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆధ:పాతాళానికి వెళ్లిందో మీరే చూస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కొంత ఆలస్యం అవ్వొచ్చు కానీ, చేసి తీరుతామన్నారు. దుబారా ఖర్చులు మానేసి ప్రజావసరాలు తీరేలా పరిపాలన కొనసాగిస్తామన్నారు. దేశంలోనే అన్ని వనరులున్న రాష్ట్రం తెలంగాణమని తెలిపారు. అలాంటిది పాలనా పరమైన ఇబ్బందులవల్ల గాడి తప్పిందన్నారు. అయినా మంత్రులం అంతా సన్మాన్వయం చేసుకొని అతి కొద్ది రోజుల్లోనే మీరు శభాష్ అనేలా పాలన కొనసాగిస్తామన్నారు. తప్పకుండా మీ న్యాయమైన డిమాండ్లను కేబినెట్ మంత్రులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో తనని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు మీ వద్దకు వచ్చానని అన్నారు.
Farooq Abdullah: రాముడు ప్రపంచంలోని ప్రజలందరికీ దేవుడే.. కేవలం హిందువులకు మాత్రమే కాదు..