NTV Telugu Site icon

Fish Medicine: నేటి నుంచి చేప మందు పంపిణీ.. ప్రారంభించిన మంత్రి తలసాని

Fish

Fish

Fish Medicine: మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం చేప ప్రసాదం పంపిణీని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రారంభించారు. నేటి నుంచి రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. 34 కౌంటర్లు, 32 క్యూలు సిద్ధం చేసి.. వికలాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ, రేపు.. రెండు రోజుల తర్వాత మరో వారం రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇవాల్టి నుంచి చేప మందు పంపిణీ ప్రారంభమై 10వ తేదీ వరకు కొనసాగనుంది. కాగా చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు నగరంతో పాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారు. చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఇప్పటికే క్యూలు కనిపిస్తున్నాయి.

Read also: Distribution of Sheep: నేటి నుంచి గొర్రెల పంపిణీ.. మంచిర్యాలలో సీఎం, నల్లగొండలో తలసాని

గురువారం ఉదయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్, ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన మేరకు ఆరు లక్షల చేప పిల్లలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు తరలించేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆస్తమా బాధితులు, వారి సహాయకులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలి రావడంతో మైదానం రద్దీగా మారింది. మైదానానికి చేరుకున్న వారికి ఫలహారాలు, ఆహార సదుపాయాలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాయి. క్యూలు కిక్కిరిసి ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ లో చేప మందు పంపిణీ | Fish Medicine Distribution At Nampally Exhibition Grounds | Ntv