Site icon NTV Telugu

Thalasani Srinivas: ఎన్టీఆర్ ఒక మహాపురుషుడు.. అలాంటి వ్యక్తి చరిత్రలో అరుదు

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Thalasani Srinivas Yadav: తెలుగు జాతిని ఉన్నత స్థాయిలో నిలిపిన ఆంధ్ర జాతి ప్రియతమ నందమూరి తారక రామారావు. తెలుగువారి వాణిని ఢిల్లీ పీఠం వరకు వినిపించేలా.. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలో తనదైన ముద్ర వేసిన విలువలున్న రాజకీయ నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్. నేడు ఆ యుగపురుషుని శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కుటుంబ సభ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ నేతలు, అభిమానులు ఘన నివాళులర్పించారు.

Read also: Jaipur : రాజస్థాన్ లో దారుణం.. వృద్ధురాలిని చంపి మాంసం తిన్న యువకుడు

అయితే ఈనేపథ్యంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్టీఆర్ ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. అనంరతం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఒక మహాపురుషుడు, ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చరిత్రలో అరుదన్నారు. ఎన్టీఆర్ సినీ నటుడుగానే కాకుండా పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చారని తెలిపారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ వేసిన మొక్కలు నేడు చెట్లు అయ్యాయని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయంగా యువతకు అవకాశం కల్పించారని మంత్రి తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ మకుటం లేని మహారాజు అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎన్టీఆర్ ను స్మరించుకుంటున్నారని తెలిపారు. మేము కూడా చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చరిత్రలో అరుదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.
Vijayashanthi: సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే

Exit mobile version