Site icon NTV Telugu

Minister Srinivas Goud : పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే లైసెన్స్ రద్దు

ఇటీవల రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్ లోని పబ్ పై టాస్క్ ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి 148 మంది యువతి యువకులను పట్టుకున్న ఘటన ప్రస్తుతం తెలంగాణలో హాట్‌ టాపిక్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లోని రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో మత్తు మందులు స్వాధీనం చేసుకున్న సంఘటన పై రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తక్షణమే స్పందించారు. రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ యాజమాన్యం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రూల్స్ ను అతిక్రమించినందుకు పబ్‌, బార్ లైసెన్స్ ను తక్షణమే రద్దు చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ ను మంత్రి ఆదేశించారు.

డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో గతంలో హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో సమన్వయ సమావేశం నిర్వహించామన్నారు. పబ్ లలో డ్రగ్స్ వినియోగం జరగకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాలని గత సమావేశంలో పబ్ యజమానులను గతంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం పై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్ ను రద్దు చేస్తామని, నిబంధనలు పాటించని పబ్ ఓనర్లు ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు. నిన్నటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.

https://ntvtelugu.com/balka-suman-demanded-to-resign-revanth-and-bandi-sanjay/

 

Exit mobile version