Minister Seetakka: మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను అంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్, బేల మండలాల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మట్లాడుతూ.. బీజేపి దేవుళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుందన్నారు. పదేళ్ళలో ఎం అభివృద్ది చేయలేదు కాబట్టే దేవుడి పేరు చెప్పుతున్నారని అన్నారు. అడిగితే అయోధ్య కట్టాము అనే బిజేపి నేతల్ని ఊరు లో చేసిన అభివృద్ధి,గుడి కి ఇచ్చిన నిధులేంటో అడగండని తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు ఇచ్చిన మాట నిబెట్టుకొనే మనిషి అన్నారు. రుణ మాఫీ చేసి తీరుతాం.. రైతు బంధు రాని వారు అదైర్య పడొద్దు.. ఇస్తామన్నారు. గతంలో బీజేపి ఎంపిని గెలిపిస్తే ఇక్కడ ఏం చేసారు అది అడగాలని తెలిపారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు చేసి పోయాడన్నారు.
Read also: Kishan Reddy: కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్..
పెదోళ్ళకి కరెంట్ కట్ చేశాడు, ఫాం హౌస్ లకు కరెంట్ ఫ్రీ ఇచ్చాడని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక 2వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు. మహిళ లకు బస్ ప్రయాణం ఉచితం చేశామన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ అన్నారు. మోడీ వచ్చాక మహిళలు బంగారం తాకట్టు పెట్టే పరిస్తితి వచ్చిందని అన్నారు. పన్నుల రూపంలో పెదోళ్ళని మరింత కష్టాల్లోకి నెట్టారన్నారు. మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను అన్నారు. కట్టుకునే బట్ట పైన ,తినే రొట్టె పైన పన్ను అన్నారు. కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంట్ కు పేటెంట్ అన్నారు. ఉపాధి పథకం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందన్నారు. రాహుల్ ది త్యాగాల కుటుంబం అన్నారు. బీజేపి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
Divorce Temple: ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ