సాధారణంగా కోరిన కోరికలు తీరాలంటే దేవుడికి మొక్కుకుంటాం.. ఆ తర్వాత ముడుపులు కడుతుంటారు. అయితే కొన్ని ఆలయాల్లో ప్రత్యేకించి కొన్ని కోరికలు నెరవేరుతాయి అని అని మనం అప్పుడప్పుడూ వింటుంటా.
ఉదాహరణకు చిలుకూరు బాలాజీని వీసాల స్వామి అంటారు. అక్కడ మొక్కులు మొక్కుకుంటే అమెరికా వీసా వస్తుందని భక్తుల నమ్మకం. అయితే మీరు ఎప్పుడైనా విడాకుల ఆలయం గురించి విన్నారా.. లేదా అయితే ఇప్పుడు తెలుసుకోండి.
ఈ ప్రపంచంలో ఎన్నో వింత చరిత్రకలిగి ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే నిజమా అనిపిస్తుంది. ఈ రోజు అలాంటి ఓ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది విడాకుల ఆలయం వినడానికి చిత్రంగా ఉన్నా.. ఇది నిజంగానే ఉంది.
ఈ ఆలయ చరిత్ర సుమారు 600 సంవత్సరాల నాటిది. ఈ ఆలయం జపాన్‌లోని కమకురా నగరంలో ఉంది. ఈ దేవాలయం గృహ హింసకు గురైన మహిళలకు న్యాయం చేసే నిలయంగా చూస్తుంటారు.
శతాబ్దాల క్రితం స్త్రీలు తమ నిరంకుశ భర్తలను వదిలించుకోవడానికి ఈ ఆలయాన్ని ఆశ్రయించేవారని చెబుతారు.
జపాన్‌లో ఉన్న ఈ దేవాలయం పేరు మత్సుగోకా టోకీ-జీ. 12వ, 13వ శతాబ్దాల్లో జపనీస్ సమాజంలో విడాకుల నిబంధనలు పురుషుల కోసం మాత్రమే అమలు చేసేవారంట.
ఆ కాలంలో పురుషులు తమ భార్యలకు చాలా సులభంగా విడాకులు ఇచ్చేవారు. అయితే గృహ హింస.. వేధింపులకు గురైన మహిళల కోసం ఓ ఆలయాన్ని నిర్మించారు.
జపాన్‌లోని కామకురా యుగంలో ఈ ఆలయాన్ని కకుసన్-ని అనే సన్యాసి నిర్మించారు. ఆమె తన భర్తతో ఎప్పుడూ సంతోషంగా జీవించలేదు. అయితే భర్త నచ్చలేదని ఆమెకు విడాకులు తీసుకునే మార్గం లేదు.
దీంతో ఈ ఆలయాన్ని నిర్మించింది. స్థానికులు చెప్పిన ప్రకారం ఈ ఆలయంలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత మహిళలు తమ భర్తలతో సంబంధాలు తెంచుకోవచ్చు. కాలక్రమంలో ఈ గడువుని రెండేళ్లకు తగ్గించారు.
1902 సంవత్సరం వరకు ఆలయంలో పురుషుల ప్రవేశాన్ని నిషేధించారు. అయితే 1902లో ఈ ఆలయ సంరక్షణను ఎంగాకు-జీ స్వీకరించినప్పుడు.. ఆలయ నిర్వహణకు మగ మఠాధిపతిని నియమించాడు.
ఇక ఆ తర్వాత ఈ ఆలయంలో మొక్కుకుంటే విడాకులు వస్తాయని స్థానికులు నమ్మేవారు. దీంతో విడాకులు తీసుకోవాలి అనుకునే చాలా మంది ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.