Site icon NTV Telugu

Minister Seethakka : బీఆర్ఎస్ అంటే అప్పులు.. కాంగ్రెస్ అంటే అభివృద్ధి

Seethakka

Seethakka

Minister Seethakka : ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి సీతక్క, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసి బదనాం చేస్తోందని ఆరోపించారు. యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని, రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నిందలు వేస్తోందని ఆమె అన్నారు.

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో వర్షాల విరుచుకుపాటు.. రాష్ట్రం అతలాకుతలం!

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని విమర్శించిన మంత్రి సీతక్క, తాము భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను, మహిళలకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరిన ఆమె, స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు.

Rahul Gandhi : ఓట్లు తొలగింపు వివరాలు ఇవ్వాలని కర్ణాటక సీఐడీ కోరినా.. ఈసీ స్పందించడంలేదు

Exit mobile version