NTV Telugu Site icon

Satyavathi rathod: సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌ లోని ఎస్కార్ట్ వాహనం బోల్తా.. మంత్రి సేఫ్‌

Sathyavathi Rathod

Sathyavathi Rathod

Satyavathi rathod: రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారి కాన్వాయ్‌ లోని ఎస్కార్ట్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. ములుగు జిల్లాలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాడ్వాయి సమీపంలో బొలెరో వాహనం కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎస్కార్ట్‌ వాహనం స్వల్పంగా దెబ్బతింది. బోలోరే వాహనదారుడు సైతం క్షేమంగా ప్రమాదం నుండి బయటపడ్డారు.

Read also: FD Interest Rates: ఆ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ రేటు

మంత్రి సత్యవతి రాథోడ్ , స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి.. తిరిగి వస్తుండగా.. తాడ్వాయి వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం, కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం భారీగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం బోల్తా పడగా, ఎస్కార్ట్ వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. కాగా, ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్‌తో పాటు ఎస్కార్ట్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. గన్‌మెన్లకు మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్ గన్‌మెన్లతో స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ముప్పనపల్లి గ్రామంలో.. జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుతో పాటు మండల ప్రజాపరిషత్ కార్యాలయం, గ్రామ దవాఖానను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఆ తర్వాత ఏటూరునాగారం ప్రభుత్వాసుపత్రిలో ఇమ్యునోలాజికల్ డయాగ్నసిస్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్కతోపాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.