Site icon NTV Telugu

Minister Niranjan Reddy: మంత్రి ఫోటోతో వాట్సప్‌ డీపీ.. నేతలకు సందేశాలు..

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

Fake ID in the name of Minister Niranjan Reddy: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఫోటోను తన ఫోన్‌ లో డీపీగా పెట్టుకున్నాడు. మంత్రి చేసినట్లే నేతలకు మేసేజ్‌లు పంపిస్తుండటంతో ఇది కాస్త కలకలం రేపుతోంది. అసలు మంత్రి నేతలకు వేరే నెంబర్‌ నుంచి మేసేజ్‌ లు పంపించడం ఏంటని పలువురు నేతలు మంత్రికి తెలపడంతో ఈ వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. మంత్రి పేరుతో వాట్సప్‌ మెసేజ్‌ లు రావడం చర్చకు దారితీసింది.

ఏం జరిగింది?
ఓ వ్యక్తి తన డీపీని మంత్రి ఫోటోను పెట్టుకున్నాడు. తన నెంబర్‌తో పలు నేతలకు హాయ్‌, హలో, హౌఆర్‌యూ అంటూ మెసేజ్‌ పంపించాడు. ఓనేతకు మెసేజ్‌ రావడంతో నెంబర్‌ కొత్తగా అనిపించింది. కానీ.. డీపీ మాత్రం మంత్రి నిరంజన్‌ రెడ్డి కావడంతో.. షాక్‌ తిన్నాడు. ఎవరు మీరు అంటూ రిప్లై ఇచ్చారు నేత. దాంతో ఆ ఆజ్ఞాత వ్యక్తి నేను మంత్రినంటూ జవాబిఇచ్చాడని గుర్తించారు. దీంతో మంత్రి.. పీఆర్ వో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా మంత్రి పేరుతో వాట్సప్‌ చాటింగ్‌ చేస్తే.. స్పందించవద్దని కోరారు. ఈవిషయంపై వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి మాట్లాడారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి ఫోటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకుని ఓ నంబర్‌ నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు మెసేజ్‌ లు వచ్చాయని, ఈపని సైబర్‌ నేరగాళ్ల పనిగా గుర్తించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఆవ్యక్తిని పట్టుకుంటామని తెలిపారు. మంత్రి పేరుతో నేతలకు మెసేజ్‌ వస్తే పోలీసులకు సంప్రదించాలని సూచించారు.
Asia Cup 2022: అభిమానులు బీ రెడీ.. రేపటి నుంచే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు

Exit mobile version