Site icon NTV Telugu

Minister Prashanth Reddy : అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయి

Minister Vemula Prashanth Reddy about Telangana Assembly Budget Sessions 2022.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆఖరి రోజు సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయని ఆయన అన్నారు. శాసన సభ 54 గంటల 55నిమిషాలు సాగిందని, మండలి 12 గంటలు సాగిందని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ద్వారా కొన్ని ముఖ్య ప్రకటనలు వచ్చాయని, తక్కువ రోజులు ఎక్కువ సమయం సమావేశాలు సాగాయన్నారు. ప్రజాధనం వృధా కావడం కేసీఆర్ ఇష్టం ఉండదని, ఎన్ని రోజులు జరిపిన ఎక్కవ సమయం నడిపామన్నారు.

మినిమం 8 గంటలు, ఒక్కోరోజు 12 గంటలు కూడా సాగిందని ఆయన వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్క ప్రతి పక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడాలి అని మాట్లాడితున్నారని.. వాళ్లకు ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది 6మంది.. కానీ ఇద్దరు ముగ్గురే ఉన్నారు.. ఒక్కో సారి అసలే లేరు సభలో.. అన్నింటికీ సమాధానాలు ఇచ్చాము ఉన్నవాళ్లకు కూడా అవకాశం కల్పించాం.. సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ లకు అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు.

Exit mobile version