Site icon NTV Telugu

ఫీవర్‌ సర్వేలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఆగ్రహం

కోవిడ్, ఫీవర్ సర్వే, దళిత బంధు పై నిజామాబాద్‌ అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోవిడ్‌ ఆంక్షలు, ఫీవర్‌ సర్వేలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీవర్‌ సర్వేను చేపట్టిందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. సమగ్ర వివరాలు లేకుండా మీటింగ్‌కు ఎందుకు వచ్చారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

Read Also:2022 ఐపీఎల్ వేలంలో 1,214 మంది ఆటగాళ్లు

కొంతమంది సిబ్బంది ఫీవర్‌ సర్వే సరిగ్గా చేయడం లేదని మంత్రి అన్నారు. నేను ఓ గ్రామాన్ని పరిశీలిస్తే గత సంవత్సరం చేసిన సర్వే రిపోర్ట్‌నే చూపించారన్నారు. గత సంవత్సరం వివరాలనే ఇప్పుడు చూపించాలని చూశారన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కోవిడ్ మూడో వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ బెడ్‌లను ఇప్పటికే సిద్ధం చేశామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

Exit mobile version