NTV Telugu Site icon

Ponnam Prabhakar: 1 నుంచి 5వ తేదీలోపు జీతాలు.. పొన్నం క్లారిటీ

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా పాలనపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజా పాలనను విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి కుటుంబానికి ఆరు హామీలు వచ్చేలా ప్రభుత్వం దరఖాస్తు ఫారాలను అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అప్పులపై స్వేదా పత్రాన్ని విడుదల చేసిన బీఆర్ ఎస్ నాయకులు.. ముందుగా కల్వకుంట్ల కుటుంబీకుల ఆస్తుల నిర్మాణ పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతినెలా 1 నుంచి 5వ తేదీలోపు జీతాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అనంతరం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఆలుగునూర్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు.

Read also: Israel Embassy : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు.. సీసీటీవీలో కనిపించిన అనుమానితులు

కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపరిపాలన నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రజాపరిపాలన కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. అయితే.. ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి.. ఎలా పూరించాలి.. దానికి ఎలాంటి పత్రాలు కావాలి వంటి సందేహాలు ప్రజలకు ఉన్నాయి. అయితే.. వాటన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫారమ్‌ను సిద్ధం చేసింది. అయితే.. ఒక్కో పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఒకే దరఖాస్తును సిద్ధం చేసింది.
YSR Congress Party: వైసీపీ రెండో లిస్ట్‌ రెడీ..! సిట్టింగ్‌లలో టెన్షన్‌.. వారి మార్పు తప్పదా..?