Site icon NTV Telugu

Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి

Ponnam Prabhakar

Ponnam Prabhakar

సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్‌లో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ప్రభుత్వం తరుపున పండుగ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్ని అమలు చేస్తాం. హుస్నాబాద్ లోని మోడల్ స్కూల్ లో కరం విద్యార్థులకు కారం పెట్టిన ఘటన పై కలెక్టర్ తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని చెప్పాను. హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్, ఆర్టీవో కార్యయలం ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నాం. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, భూ నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేలా కృషి చేస్తా. హుస్నాబాద్ నియోజక వర్గాన్ని నిర్లక్ష్యం చేయనని క్రిస్మనస్ సాక్షిగా చెప్తున్న. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తాను. 24 గంటలు నియోజర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను, క్రైస్తవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతాం’ అన్నారు.

Exit mobile version