Site icon NTV Telugu

Ponnam and Adluri : అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం

Ponnam Adluri

Ponnam Adluri

Ponnam and Adluri : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల ఏర్పడిన అంతర్గత విభేదాలు సర్దుబాటు అయ్యాయి. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సమస్య పరిష్కారమైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ భేషరతుగా క్షమాపణ తెలిపారు. దీంతో పార్టీలో ఐక్యతను రక్షించేందుకు సంకేతం ఇచ్చారు.

IMC 2025: ఆసియాలోనే అతిపెద్ద టెలికాం ఈవెంట్.. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించిన పీఎం మోడీ

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “అడ్లూరి లక్ష్మణ్ ఇబ్బంది పడ్డారు. అందుకే భేషరతుగా క్షమాపణ చెప్పడం జరిగింది. అన్ని విషయాలు కుటుంబ సంబంధ సమస్యలుగా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యను ఇంతటితో ముగించాలనే కోరుతున్నాను” అని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుంది. ప్రతి కార్యకర్త, నాయకుడు ఐక్యంగా పని చేయాలని కోరుకుంటున్నాం” అని చెప్పారు.
Credit cards: ఏం వాడకమయ్యా.. 1638 క్రెడిట్ కార్డులు వాడి.. గిన్నీస్ రికార్డుల్లోకి హైదరాబాద్ వ్యక్తి

Exit mobile version