తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న శక్తులు ఇంకా తెలంగాణలోనే ఉన్నాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ శక్తులే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అన్నారు. దేశంలో 58 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని.. డబ్బను పుట్టించడం మళ్లీ ఆ డబ్బును ఖర్చు అయ్యేలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మెరగుపడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయం ద్వారానే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెద్ద పీట వేశారని అన్నారు. రూ. 2 కిలో బియ్యం తీసుకుని బతికిన పేదరికం నుంచి దేశానికి అన్నం పెడుతున్న స్థాయికి తెలంగాణ ఎదిగిందని అన్నారు. 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రధాన మంత్రి మోదీ అన్నారని.. కానీ ఇప్పటికీ అది అమలు కాలేదని తెలిపారు.
ఇక ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై, టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత నుంచి ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్ పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. కేంద్రం ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ, అప్పుల్లో కూరుకుపోతుందని.. ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేది బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. తాజాగా మల్లారెడ్డి మీద దాడి యత్నం టీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.
