ఆరోగ్య సేవలో గత 20 ఏళ్లుగా దక్షిణ భారత దేశ ప్రజలకు సేవలు అందిస్తున్న డా.కేర్ హోమియోపతి 54వ బ్రాంచీని హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, డా.కేర్ సీఎండీ ఏఎం రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ యూ.గోవిందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. హోమియోపతి అనేది గొప్ప వైద్య విధానంగా పేదవాళ్లు, కార్మికులు తక్కువ ఖర్చుతో విలువైన వైద్యాన్ని పొందవచ్చన్నారు. కరోనా సమయంలో డా.కేర్ హోమియోపతి వైద్య సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాస్త్రీయమైన వైద్య విధానం హోమియోపతి అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. బ్రాంచీలలో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వైద్య సంస్థగా ఎదిగిన డా.కేర్ హోమియోపతి ఈరోజు కొంపల్లిలో 54వ బ్రాంచీని ప్రారంభించినట్లు డా.కేర్ సీఎండీ ఏఎం రెడ్డి అన్నారు. కొంపల్లిలో డా.కేర్ హోమియోపతి వైద్య బృందం అందుబాటులో ఉంటుందని.. అందరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. తాత్కాలిక జబ్బులకు హోమియోపతి మందులు వాడటం వల్ల దీర్ఘకాలిక జబ్బులు వచ్చే అవకాశం లేదని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ యూ.గోవిందరావు తెలిపారు.
Malla Reddy
