Site icon NTV Telugu

Minister Malla Reddy: కాళ్లకు చెప్పులు వేసుకొని జెండాను ఎగరవేసిన మంత్రి

Minister Malla Reddy

Minister Malla Reddy

Minister Malla Reddy: దేశవ్యాప్తంగా 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే జాతీయ జెండాను ప్రముఖులు ఎగరవేసి అధికారులు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్ర కోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించగా.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేసి, సెల్యూట్ చేసారు. ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాగా మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం నాడు మంత్రి మల్లారెడ్డి చేసిన పనికి ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు మండిపడుతున్నారు.

Read also: Pawan Kalyan : మగవాళ్లు భయపడినా.. మహిళలు భయపడకూడదు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో అధికారుల అందరి ఎదుట జాతీయ జెండాను మంత్రి మల్లారెడ్డి ఎగరవేసారు. అయితే మంత్రి కాళ్లకు చెప్పులు వేసుకొని జెండాను ఎగరవేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి అయి ఉండి కాళ్లకు చెప్పులు వేసుకుని జాతీయ జెండాను ఎగరవేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ అభిషేక గత్య, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు అందరూ చూస్తుండగానే మంత్రి మల్లన్న జాతీయ జెండాను అలా ఎగరవేయడం గమనార్హం. మంత్రి చెప్పులు వేసుకుని జాతీయ జెండాను ఎగరవేస్తున్న అధికారులు అందరూ చూస్తూ ఉండిపోయారే తప్ప ఏమీ చేయలేకపోయారు. ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ విముక్తి కోసం ప్రాణాలను ఇచ్చిన వారిని మంత్రి మల్లారెడ్డి గౌరవించకపోవడం దారుణమని ప్రజలు అనుకుంటున్నారు.
Ricky Kej: బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో జ‌న గ‌ణ మ‌ణ… వింటే గూస్ బంప్సే

Exit mobile version