Malla Reddy: అట్లుంటది మల్లారెడ్డితో.. మరోసారి డీజే స్టెప్పులతో ఇరగదీసిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy: అందరు రాజకీయ నేతల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి సమ్‌థింగ్ స్పెషల్. ఆయన ఏం చేసినా ట్రెండ్ సెట్టరే. ఆయన మాటల్లో ఫుల్ పంచులు.. పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. స్టెప్ వేస్తే సోషల్ మీడియా దద్దరిల్లాల్సిందే. అలాంటి మల్లారెడ్డి మరోసారి డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించారు. 70 ఏళ్లు వచ్చినా నిత్య యువకుడిలా ఫుల్ జోష్ లో ఉంటారు. తాజాగా హెల్త్ అవేర్ నెస్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ పై స్టెప్పులు వేశారు. ఆటైనా.. పాటైనా.. డ్యాన్స్ అయినా మంత్రి మల్లారెడ్డి.. సై అనాల్సిందే. డిజే టిల్లు పాటకు చప్పట్లు కొడుతూ స్టెప్పులేస్తూ యువతలో జోష్ నింపారు. మంత్రి మల్లారెడ్డి మైక్ పట్టుకోగానే.. జనాలు హర్షధ్వానాలతో హోరెత్తించారు. డీజే స్టార్ట్ కాగానే అక్కడున్న వారంతా ఊగిపోయారు. మల్లారెడ్డి మాట్లాడే మాటల్లో కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా అనే మాటలు ఇప్పటికీ హైలెట్స్ అనే చెప్పాలి. మల్లన్న డ్యాన్స్ కు కుర్రాళ్లు కూడా మరో సారి కుళ్లుకునేలా చేశారు. డీజే పాటకు స్టేజ్ ఎక్కిన మల్లన్న స్టెప్పువేస్తూ షేక్ చేశారు. ఆయన జోష్ అలా ఉంటుంది మరి.
మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకల్లో డీజే టిల్లు హీరో జొన్నలగడ్డ సిద్దు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హాజరయ్యారు. డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు హీరో సిద్ధూతో కలిసి మంత్రి మల్లారెడ్డి వేదికపైకి స్టెప్పులేశారు. మంత్రి మల్లారెడ్డితో హీరో సిద్ధూ సంతకం స్టెప్పులు కూడా వేయించారు. ఇద్దరూ వేదికపై కాసేపు డ్యాన్స్ చేసి ఉత్సాహాన్ని నింపారు. మంత్రి, హీరో చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏ వేడుక జరిగినా మంత్రి మల్లారెడ్డి హంగామా మామూలుగా ఉండదు. మాస్ పాటలకు స్టెప్పులేసి అందరినీ అలరించారు. మంత్రి మల్లన్న మరోసారి ఇలాగే అడుగులు వేస్తూ ట్రెండ్ అవుతున్నారు. గతంలో మునుగోడులో టీఆర్‌ఎస్ బహిరంగ సభలో హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన మల్లారెడ్డి.. తెలంగాణ పాటలకు ధీటుగా స్టెప్పులేసి జనాల్లో ఉత్సాహాన్ని నింపిన విషయం తెలిసిందే. మల్లన్న స్టెప్పులేయడం సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.
Swachhata Hi Sewa: కొనసాగుతున్న స్వచ్ఛతా హి సేవా ప్రచారం..
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..