NTV Telugu Site icon

Minister KTR: మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం

Ktr Fires

Ktr Fires

Minister KTR Writes A Letter To Centre About Hyderabad Metro Rail Second Phase: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి ఘాటైన లేఖ రాశారు. వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగర ట్రాఫిక్ రద్దీ సరిపోదని అనడం అర్థరహితం అని మండిపడ్డారు. యూపీలోని వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ వంటి చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులు కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపించడం ముమ్మాటికీ వివక్షేనని ధ్వజమెత్తారు. తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వకుండా కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. గతంలో మెట్రో రెండో దశ సమాచారాన్ని డీపీఆర్‌తో సహా అందించామని తెలియజేశారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని తాము ఆశించామన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ విస్తరణ ప్రతిపాదనలో ఉన్న సానుకూలతల నేపథ్యంలో కేంద్రం ఆమోదం వేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు కోరారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు.

Revanth Reddy: పేపర్ లీకేజీలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది

అంతకుముందు.. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకొస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రోరైలును పొడిగిస్తున్నామన్న ఆయన.. ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు మెట్రోరైలు మార్గం వెళుతుందన్నారు. మూడేళ్లలో 31 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ నగరానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, దాంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించబడుతున్నాయని చెప్పారు. ఇప్పుడు హైదరాబాదులో జరుగుతోంది ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్తులో చాలా వేగవంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. నాగోల్ నుండి ఎల్బీనగర్, గచ్చిబౌలి నుండి లక్డికాపూల్ వరకు మెట్రో చేపడతామని తాము కేంద్రానికి లెటర్ రాస్తే.. అది ఫీజబుల్ కాదని కేంద్ర ప్రభుత్వం అంటోందని పేర్కొన్నారు. హైదరాబాద్ కంటే చిన్న నగరాలకు డబ్బులిచ్చిన కేంద్రం.. ఇక్కడ ఫీజబులిటీ కాదనడం సరైందని కాదని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదా? హైదరాబాదు నుండి పన్నులు దేశానికి వెళ్లడం లేదా? అని అని ప్రశ్నించారు. తెలంగాణ, హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్రం మద్దతివ్వాలిన తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.

Anasuya: వాటిని చూపిస్తూ అనసూయ షో.. అందరి చూపు ఆ పుట్టుమచ్చ మీదనే

Show comments