టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఎంతో బిజీబిజీగా గడిపారు. అంతేకాకుండా అమెరికాలో తన జ్ఞాపకాలను కూడా నెమరువేసుకున్నారు. అయితే కేటీఆర్ సోదరి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య కూడా అమెరికాలోనే విద్యనభ్యసిస్తున్నాడు. అమెరికా పర్యటనలో ఎంతో బిజీగా ఉన్న కేటీఆర్.. తన మేనల్లుడు ఆదిత్యను కలిసి కొంతసేపు గడిపారు. ఈ సందర్భంలోనే వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను కవిత ట్విట్టర్‌లో పంచుకున్నారు. అంతేకాకుండా అమెరికా పర్యటనలో ఎంతో బిజీగా ఉన్నా కూడా అక్కడే చదువుకుంటున్న తన మేనల్లుడిని కలిసే విషయం మాత్రం మరిచిపోలేదంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Minister KTR : ఎంత బీజీగా ఉన్నా.. మేనల్లుడితో ఇలా..
