NTV Telugu Site icon

Tankbund Shiva: త్వరలో మీ ఇంటికొస్తా.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్‌ ట్వీట్

Tankbund Shiva

Tankbund Shiva

Minister ktr will visit tankbund shiva home-soon: ట్యాంక్ బండ్ శివ అదేనండి శవాల శివ ఈయన గురించి హైదరాబాద్‌ లో చాలా మందికి తెలుసు, ఎన్నో ఏళ్లుగా ట్యాంక్‌బండ్ వద్దే ఉంటున్నారు. పలు కారణాలతో హుస్సేన్ సాగర్‌ లో పడి ఆత్మహత్యాయత్నం చేసుకొనే వారికి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారు. అంతేకాదు.. ట్యాంక్‌ బండ్‌ లో చనిపోయిన వారి శవాలను సైతం తన చేతులతో బయటకు తీశారు. హుస్సేన్‌ సాగర్‌ అంటేనే కంపు అంటాం.. ఏదో అలా అక్కడి నుంచి వెళ్లి కాసేపు వుండి విహరించి రావడం వేరు. కానీ.. కంపు కొట్టే హుస్సేన్ సాగర్ జలాల్లో ఈతకొడుతూ, నిస్వార్థంగా సమజానికి సేవ చేస్తున్నారు శివ. ప్రేమించి పెళ్లి చేసుకున్న శివకు భార్య, పిల్లలు వున్నారు. ఇతని నివాసం ట్యాంక్ బండ్ మీద చిన్న గుడిసె. శివ పేదరికంపై పలు పత్రికలు, ఛానెళ్లు ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఆ ఇంటర్వ్యూలలో శివ తన కష్టాలు, జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి తెలుపడంతో.. చలించిపోయిన తెలంగాణ మంత్రి కేటీఆర్ శివకు నెక్లెస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇప్పించారు. తాజాగా శివ కుటుంబం కొత్త ఇంటికి వెళ్లింది. ఇప్పుడు ప్రస్తుతం శివ తన ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఆనందంగా ఉన్నారు.

read also: Pakistan PM: పాకిస్తాన్ ప్రధాని అవస్థలు.. రష్యా అధ్యక్షుడి నవ్వులు!

అయితే.. ప్రస్తుతం ట్యాంక్ బండ్ శివ జీవితం ఎలా ఉంది? ఏం చేస్తున్నారని? ఓ యూట్యూబ్ ఛానెల్‌ ఆయన ఇంటికి వెళ్లింది. ఈనేపథ్యంలో.. శివ తన మనసులోని కోరికను బయటపెట్టారు. మంత్రి కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.. కేటీఆర్ ఎంతో మంచిమనసున్న మారాజని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు వారి కుటుంబం ఎల్లప్పుడు రుణపడి ఉంటుందని, ఆయన చేతుల మీదుగా గృహప్రవేశం జరగాలని కోరుకున్నామన్నాడు. కానీ, అది జరగనందుకు కొంత బాధగా ఉన్నా.. అన్నం పెట్టిన దాత, ఒక్కసారైన తన ఇంటి గడప తొక్కాలని అభిప్రాయపడ్డారు శివ. దీంతో ఈ వీడియోను కేటీఆర్‌ ట్వీటర్‌ కు ట్యాక్‌ చేశారు. శివ వీడియోపై స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే ట్యాంక్ బండ్ శివ ఇంటికి వెళ్తానని తెలిపారు. దీంతో సోషల్‌ మీడియాలో ఈవార్త హల్ చల్‌ గా మారింది. శివ ఇంటికి మంత్రి కేటీఆర్‌ వెళ్తారా? అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ను స్పందిస్తూ.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. కేటీఆర్‌ అంటే మంత్రేకాదు ప్రజల్లో ఒక మనిషిని అని నిరూపించుకున్నారని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కానీ శివ ఇంటికి కేటీఆర్‌ ఎప్పుడు వెళ్తారా అనే ప్రశ్న మాత్రం ఇంకా ఖరారు కాలేదు. దీని కోసం నెటిజన్లు వేచి చూస్తున్నారు. ఇక శివ ఇంటికి కేటీఆర్‌ వెళ్తే ఏ రేంజ్‌ లో వుంటుందో చూడాలని మరి అంటూ నెటిజన్లు పోస్ట్‌ ల మీద పోస్ట్‌ లు చేస్తు్న్నారు. తెలంగాణ మంత్రా మజాకా.. అంటూ నెటిజన్లు ట్విట్లు ఇప్పుడు షోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pakistan PM: పాకిస్తాన్ ప్రధాని అవస్థలు.. రష్యా అధ్యక్షుడి నవ్వులు!

Show comments