NTV Telugu Site icon

Minister KTR: నేడే సిరిసిల్లకు కేటీఆర్‌.. అమ్మమ్మ ఊరులో బడి నిర్మాణానికి శంకుస్థాపన

Ktr Minister

Ktr Minister

Minister KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్. ఉదయం 11 గంటలకు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ, నూతన ఎంపీ డివో ఆఫీస్ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్న కేటీఆర్‌కు సిరిసిల్ల ప్రజలు అండగా నిలిచారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తలొగ్గకుండా సెస్‌ ఎన్నికల్లో ఏకపక్షంగా బీఆర్‌ఎస్‌ బలపరిచిన 15 మంది అభ్యర్థులను డైరెక్టర్లుగా మధ్యాహ్నం 12.30 గంటలకు సెస్ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో మధ్యాహ్నం 1 గంటకు రైతు కృతజ్ఞత సభ ఉండనుంది. మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండలం కోదురూపాకలో పాఠశాల భవన నిర్మాణ కార్యక్రమంకు శంకుస్థాపనలలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.

Read also: Distribution of Ration: పండుగొచ్చె.. కానీ రేషన్‌ ఎస్తలే..

ఈ సభలో సుమారు రెండువేల మందితో నిర్వహిస్తున్న సభకు మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, శంభీర్‌పూర్‌ రాజు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి పలువురు పాల్గొననున్నారు. అయితే కేటీఆర్‌ మంత్రి హోదాలో తన అమ్మమ్మ ఊరు కొదురుపాకకు ముచ్చటగా మూడోసారి వెళ్లనున్నారు. ఇక ..మొదటిసారిగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కొదురుపాక హైలెవల్‌ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడానికి వెళ్లగా.. రెండేళ్ల క్రితం అమ్మమ్మ తాతయ్య లక్ష్మీ కేశవరావు పేరిట తన సొంత నిధులతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభోత్సవానికి ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి వచ్చారు. ఇవాళ మూడోసారి స్కూల్‌ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్నారు.

Read also: Lips Care: చలికాలంలో పెదవులు పగిలిపోకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి

అయితే.. మంత్రి కేటీఆర్‌ తన అమ్మమ్మ ఊరు కొదురుపాకపై మమకారంతో గ్రామంలో స్కూల్‌ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో జడ్పీ పాఠశాల మాత్రమే నిర్మాణం జరిగింది. ఈనేపత్యంలో.. ప్రాథమిక పాఠశాలను జడ్పీ స్కూల్‌ ఆవరణలో కొనసాగిస్తున్నారు. కాగా.. మంత్రి కేటీఆర్‌ తన అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మీ కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత నిధులతో జడ్పీ స్కూల్‌ ఎదుట ఉన్న 20 గుంటల స్థలంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మిస్తానని గతంలో ప్రజలకు మాటిచ్చారు. మంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు.. ఎంపీ సంతోష్‌కుమార్‌ తండ్రి రవీందర్‌రావుతో కలిసి భూమి పూజ చేయనున్నారు. అంతేకాకుండా.. కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని మాడల్‌ అంగన్‌వాడీ పాఠశాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
Temperature Dropped: వణికిస్తున్న చలి.. రికార్డు స్థాయిలో పడిపోతున ఉష్ణోగ్రతలు