ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న వజ్రోత్సవ సభకు హాజరవుతారు కేటీఆర్. ఇక ఈ సభలో అర్హులైన కొత్త ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడమే కాకుండా.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ చేరుకుని, ఆలయ చెరువు మైదానంలో 15 వేల మందితో జరిగే వజ్రోత్సవ వేడుకలకు హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీఆర్‌ఎస్ శ్రేణులు.
Read also: Wall Collapse: విషాదం.. భారీ వర్షం కారణంగా గోడకూలి 9 మంది దుర్మరణం
నిన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని జెఎన్‌టీయూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐసీఐఈటీ-2022) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్క తెలంగాణలోనే ప్రతి ఇంటికి తాగునీరు అందుతోందన్నారు. కాళేశ్వరం ఇంజినీరింగ్ అద్భుతమని, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో కట్టుకున్నామన్నారు. అంతేకాకుండా.. జేఎన్‌టీయూ విద్యార్థులు అంతా వెళ్లి ప్రాజెక్టు విజిట్ చేయండని ఆయన సూచించారు. మనం ఇంటికి వెళ్లి చుట్టూ చూస్తే అన్ని వేరే దేశాలు తయారు చేసిన వస్తువులే ఉంటాయని, ఈ 75 ఏళ్లలో మన ఇండియా ఒక స్పార్క్ మిస్ అయిందన్నారు. మనం మసీదునీ కూలగొట్టి గుడి కడదం అంటూ గతాన్ని తోడే పనిలో బిజీగా ఉన్నామని, కానీ చైనా లాంటి దేశాలు మాన్యుఫాక్చరింగ్ పై ఫోకస్ పెట్టాయన్నారు. కులమతాల గొడవలకు ప్రియారిటి ఇస్తే వెనకబడతామని ఆయన వ్యాఖ్యానించారు. స్టూడెంట్స్ జాబ్ సీకర్‌గా కాకుండా జాబ్ క్రియేటర్ గా తయారవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
Wall Collapse: విషాదం.. భారీ వర్షం కారణంగా గోడకూలి 9 మంది దుర్మరణం
