NTV Telugu Site icon

Minister KTR: మరోసారి కరోనా బారిన పడ్డ కేటీఆర్

Ktr Tested Corona Positive

Ktr Tested Corona Positive

Minister KTR Tested Positive For Covid 19 Again: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆరే ట్విటర్ మాధ్యమంగా ధృవీకరించారు. తనకు లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్‌గా తేలవడంతో ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నానని కేటీఆర్ తెలిపారు. ‘‘కరోనా వైరస్ పూర్తిగా వదిలి వెళ్లిందనుకున్నాను కానీ, ఇది ఇంకా వెళ్లలేదు. కొన్ని లక్షణాలు కనిపించడంతో, పరీక్షలు నిర్వహించుకున్నాను. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నాను. కొన్ని రోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన మిగతా వాళ్లందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకొని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నా’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. కేటీఆర్ కరోనా బారిన పడటం ఇదేం తొలిసారి కాదు. గతేడాది ఏప్రిల్‌లోనూ ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కూడా ఆ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు మళ్లీ కేటీఆర్ కరోనా పాజిటివ్‌గా తేలిన పక్షంలో.. కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Show comments