NTV Telugu Site icon

Minister KTR: టీఎస్ బీపాస్ దేశంలోనే ఎక్కడా లేదు

Ktr On Ts Bpass

Ktr On Ts Bpass

Minister KTR Talks About TS BPass In Telangana Assembly: టీఎస్‌ బీపాస్‌ దేశంలోనే ఎక్కడా లేదని, తమిళనాడు సీంఎ లాంటివారే దీనికి మెచ్చుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని తెలియజేశారు. ఒకవేళ అనుమతి రాకపోతే.. ఆటోమేటిక్‌గా ఇచ్చినట్టే పరిగణించాలని తెలిపారు. టీఎస్‌ బీపాస్‌తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు ఉంటాయన్నారు. అక్కడక్కడా అనుమతులు లేకుండా లే అవుట్లు వెలుస్తున్నా.. వాటిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. చట్టాలు తాము రూపొందిస్తామని, దాన్ని అమలు పర్చాల్సింది అధికారులేనని అన్నారు.

Lithium: లిథియంను కనుగొనేందుకు భారతదేశానికి 26 ఏళ్ల పట్టింది..

హౌసింగ్ డిపార్ట్మెంట్‌ను ఇతర శాఖలో విలీనం చేశామని కేటీఆర్ వెల్లడించారు. హౌజింగ్ బోర్డు కాలనీలు ఉన్నాయని.. ఇళ్లు ఇచ్చిన తర్వాత సొసైటీ ఏర్పాటు చేసుకొని, దాన్ని మెయింటెనెన్స్ చూసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ రద్దుచేసి.. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చామని.. ప్రస్తుతం కేసు హైకోర్టులో ఉందని చెప్పారు. ధరణి వచ్చిన తర్వాత చిన్న భూమి కూడా మ్యాచ్ చేశామన్నారు. భూములకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 1920లో కట్టిన ఉస్మాన్ సాగర్ నిర్మాణం జరిగిందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కానివ్వమని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు గాను కేటీఆర్ పై విధంగా స్పందించారు.

Hyderabad: స్క్రాప్ దుకాణంలో పేలుడు.. యజమానిపై కేసు

అంతకుముందు.. రాయదుర్గం నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర రూ.6,250 కోట్ల వ్యయంతో మెట్రో రెండోదశను నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇందులో కేంద్రప్రభుత్వం వాటా ఒక్క రూపాయి కూడా లేదన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో రెండోదశను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ రెండో దశలో భాగంగానే.. నాగోల్‌-ఎల్బీనగర్‌ మధ్య 5 కిలోమీటర్ల దూరం మెట్రో ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు.

Show comments