NTV Telugu Site icon

Minister KTR: పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు మోడల్‌

Minister Ktr Warangal

Minister Ktr Warangal

Minister KTR: పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ మోడల్‌గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీ టెక్స్ టైల్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనలు కేంద్రానికి మార్గదర్శకంగా మారాయన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ దేశానికే దిక్సూచిగా మారింది. దేశంలో మున్సిపల్, పంచాయతీ అవార్డుల్లో 30 శాతం మనదేనన్నారు. 3 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 33 శాతం అవార్డులు వస్తాయని చెప్పారు. మన దగ్గర నల్ల బంగారంతో పాటు తెల్ల బంగారం కూడా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే అత్యధిక నాణ్యతతో ఉందన్నారు. మాకు నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్. వరంగల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.

ఇక్కడ ఏర్పాటయ్యే కంపెనీల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్నారు. యంగ్‌వన్‌ సంస్థతో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. దేశంలో వ్యవసాయం, జౌళి రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. వరంగల్ జిల్లాలోనే నెంబర్ వన్ పత్తి సాగవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తెస్తాం. గణేశ కంపెనీ ఇప్పటికే రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు. సంస్థలో వెయ్యి మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. యంగ్ వన్ కంపెనీ మొత్తం 11 పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇక్కడ నిర్మించే పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని చెప్పారు. వరంగల్ జిల్లాలో వస్తున్న మూడు కంపెనీల వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది.

మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ పేరాలగా మారుతుందని అన్నారు. వరంగల్ లో తయారయ్యే బట్టలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారుతోందన్నారు. మీ కోసం ఐదేళ్లు కష్టపడ్డాం, ఇప్పుడు మీరు మాకు అండగా నిలవాలన్నారు. పరకాలలో ధర్మారెడ్డిపై పోటీ చేసేందుకు విపక్షాలు భయపడి నియోజకవర్గాలు మార్చుకుని ఎక్కడికో వెళ్తున్నాయన్నారు. కాకతీయ టెక్స్ టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులను సన్మానిస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్‌, డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అవుతారని స్పష్టం చేశారు. యంగ్ వన్ కంపెనీ చైర్మన్ చాంగ్ జాయ్ బోక్ మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. వరంగల్‌లో వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. యంగ్ వన్ కంపెనీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. టెక్స్‌టైల్ పార్కుపై కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ మెగా టెక్స్‌లై పార్కును ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్ ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు.
Tamil actor Vijay: టెన్త్, టువల్త్ టాపర్స్ తో తమిళ హిరో విజయ్‌..

Show comments