Site icon NTV Telugu

Minister KTR: నేడు కేటీఆర్‌ రోడ్‌షో రద్దు.. కారణం ఇదీ..

Minister Ktr

Minister Ktr

Minister KTR: కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్‌ శనివారం నిర్వహించిన రోడ్‌ సక్ష రద్దయింది. ఇతర ప్రాంతాల్లో పర్యటన ఖరారు కావడంతో ఇక్కడి రోడ్‌ షో వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. రేపు (ఆదివారం) భద్రాచలం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో రోడ్‌ షోను నిర్వహించాల్సి ఉంది. అయితే.. అందరి దృష్టి కామారెడ్డి సీటుపైనే ఉంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ మెజారిటీ లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఇతర సమన్వయ కమిటీ సభ్యులు కలిసి అత్యధిక మెజారిటీ కోసం కృషి చేస్తున్నారు. నామినేషన్ తో పాటు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది…బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరు, బీబీపేట్ మండలాల్లో కేటీఆర్ పర్యటించాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలు ప్రజలతో ముఖాముఖి అన్నట్లుగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ నేతృత్వంలో జరుగుతున్న రోడ్ షోలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ప్రసంగాలు వింటున్నారు. కేటీఆర్ చెప్పిన దాని గురించి ఆలోచించి మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందులోభాగంగా శనివారం ఉదయం 11 గంటలకు భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి నుంచి రోడ్‌షో నిర్వహించాల్సివుంది. ఓపెన్ టాప్ బస్సులో పలు గ్రామాల ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కీలకోపన్యాసం చేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, బీజేపీల చర్యలను, ఆ పార్టీల తీరును కేటీఆర్ తనదైన శైలిలో తిప్పికొట్టనున్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ రాక సందర్భంగా రానున్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఏం జరుగుతుందో వివరిస్తామన్నారు. సీఎం ప్రచార సభ మాదిరిగానే రోడ్ షోను విజయవంతం చేసేందుకు ఇప్పటికే శ్రేణులు తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు బీబీపేట్ మండలం కాచాపూర్, మాందాపూర్, జనగామ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బీబీపేట్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించే విధంగా షెడ్యూల్ ఉండగా.. వేరే పర్యటన నేపథ్యంలో కామారెడ్డి పర్యటన ఇవాళ రద్దు చేసుకున్నారు. మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, రామారెడ్డి, కామారెడ్డి మండలాల్లో ఇప్పటికే కుల సంఘాలు, గ్రామ పంచాయతీల వారీగా పెద్ద ఎత్తున తీర్మానాలు చేశారు.
Koti Deepotsavam 2023 Day 5: ఐదో రోజుకు చేరిన కోటి దీపోత్సవం.. ఇల కైలాసంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే

Exit mobile version