మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకుంది. గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రారంభమైంది కేటీఆర్ రోడ్ షో..ఘట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా కొనసాగుతుంది కేటీఆర్ రోడ్ షో.. కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు టీఆర్ఎస్ నేతలు. భారీగా హాజరైన కార్యకర్తలు, జనంతో కోలాహలం నెలకొంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గట్టుప్పల్ ఎంపీటీసీ-1 స్థానానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఈ రోడ్ షోకు సిపిఐ, సిపిఎం నేతలు హాజరయ్యారు.