Site icon NTV Telugu

అధైర్య పడొద్దు… అండగా ఉంటాం : మంత్రి కేటీఆర్

మన రాష్ట్రంలో ఈ మధ్య చిన్నారులపైన అత్యాచార కేసులు ఎక్కువగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లా… ఎల్లారెడ్డిపేట మండలం… అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన జరిగింది. ఇక దీని పై స్పందించిన మంత్రి కేటీఆర్… ఈ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి అధైర్య పడొద్దు… అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు మంత్రి కేటీఆర్.

Exit mobile version