కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ శనివారం లేఖ రాశారు. ఈ లేఖలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)ల కేటాయింపులను గురించి కేటీఆర్ ప్రస్తావించారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ఎస్టీపీఐని కేటాయించకపోవడం రాష్ట్రం పట్ల కేంద్రం వివక్షేనని ఆయన లేఖలో ఆరోపించారు.
రాష్ట్రానికి ఎస్టీపీఐ ఇవ్వకుండా కేంద్రం చూపిన వైఖరితో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతిని నమోదు చేస్తున్న తెలంగాణకు ఎస్టీపీఐ ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరికి నిదర్శనమేనని ఆ లేఖలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
