NTV Telugu Site icon

Minister KTR : కేసీఆర్‌ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు

మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ టవర్స్ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. ఎన్నో ఓటములు, ఒడిదుడుకులు ఎదుర్కొని… ఈనాడు ఇంతటి స్థాయికి కేసీఆర్ వచ్చారని ఆయన అన్నారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి… లక్ష్యాన్ని చేరుకునే దిశగా శ్రమించాలని ఆయన అన్నారు. చేసే పనిలో పట్టుదల, సంకల్పం ఉండాలని, ఐటీ నలుమూలలా విస్తరించాలని.. గ్రిడ్ తీసుకొచ్చామన్నారు. ఉత్తర హైదరాబాద్ అభివృద్ధికి.. ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు.

ఐటీ విస్తరణకు కావాల్సిన మౌళిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని, తెలంగాణలో పథకాలు.. దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ఈరోజు ఉదయం ఎంఆర్‌ఎఫ్ కంపెనీ ప్రకటించిందని ఆయన వెల్లడించారు. నేటితరం విద్యార్థులు స్కిల్స్ డెవలప్ ఆప్ గ్రేడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఉపాధి అవకాశాలకు తగ్గట్టుగా… స్కిల్ సెట్ ని పెంచుకోవాలన్నారు. జాబ్ సీకర్స్ గానే కాదు… జాబ్ క్రియేటర్స్ గా మారే అవకాశాన్ని కూడా టీ-హబ్ ద్వారా కల్పిస్తున్నామని ఆయన అన్నారు.